Header Banner

భక్తులకు మరింత సౌకర్యంగా.. టీటీడీ కొత్త గది కేటాయింపు పద్ధతి అమల్లోకి! మీ చేతిలోనే, ఇక నుంచి..!

  Sun Apr 13, 2025 15:09        Devotional

టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సాధారణ భక్తులకు ప్రాధాన్యత పెంచేలా కొత్త విధానాలు అందుబాటులోకి తీసుకొస్తోంది. బ్రేక్ దర్శనంలో వేళల మార్పు పైన ప్రయోగాత్మ కంగా కొన్ని నిర్ణయాలు అమలు చేస్తోంది. అదే సమయంలో బ్రేక్ దర్శనాలను పరిమితం చేసేలా కసరత్తు కొనసాగుతోంది. ఐఏ ద్వారా దర్శనంలో కొత్త విధానాలు తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ఇదే సమయంలో వసతి విషయంలో టీటీడీ కీలక మార్పులు తీసుకొస్తోంది. భక్తుల కు మరింత సలభతరం చేసేలా నిర్ణయం తీసుకుంది.

గదుల కేటాయింపులో
తిరుమలలో వసతి విషయంలో టీటీడీ వరుస మార్పులు చేస్తోంది. తాజాగా శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు దర్శనం ఎన్ రోల్ మెంట్ స్లిప్ పైనే గదుల కేటాయింపు విధానం టీటీడీ ఏఈవో కార్యాలయంలో ప్రారంభించారు. ఇప్పటి వరకు భక్తులు తమకు సిఫారసు చేసిన వారి అసలు ధ్రువ పత్రాలతో పాటు ఒక జిరాక్స్ ప్రతి తీసుకురావాల్సి వచ్చేది. ఆ జిరాక్స్ ప్రతిపై అదనపు ఈవో కార్యాలయ సిబ్బంది గదుల కేటాయింపునకు స్టాంపింగ్ చేసేవారు. ఇందు కోసం క్యూ లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. భక్తులకు సమయం తీసుకోవటంతో పాటుగా ఇబ్బందులు ఎదుర్కునేవారు.


ఇది కూడా చదవండి6 వేల మందిని రికార్డుల్లో చంపేసిన ట్రంప్ సర్కారు! వారికి అవి రద్దు! కారణం ఇదేనట!


తాజా మార్పుతో
కాగా, తాజాగా ఏఈవో తీసుకున్న నిర్ణయం మేరకు ఇక నుంచి భక్తుడు దర్శన ఎన్ రోల్ మెంట్ స్లిప్ తో గదుల కేటాయింపు కేంద్రాల వద్దకు వెళ్లి స్కానింగ్ చేస్తే సులభంగా గదులు పొందేలా మార్పులు చేసారు. ఈ విధానంతో భక్తులకు వెసులుబాటు కలగనుంది. తిరుమలలో నిత్యం వచ్చే వేలాది మంది భక్తుల కోసం 7500 గదులు అందుబాటులో ఉన్నాయి. గత పాలక మండలి తిరుమలలోని వసతి సముదాయాల్లో మరమ్మత్తుల కోసం రూ 110 కోట్లు ఖర్చు చేసారు. తాజా పరిశీలనలో తిరిగి ఆ సముదాయాల్లో సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. సుదర్శన్ లో 389, గోవర్ధన్ లో 196, కల్యాణ్ సత్రంలో 246 గదుల ఉన్నాయి. వీటిల్లో నీరు లీకు అవ్వటం.. పెచ్చులు ఊడటం వంటి సమస్యలు అధికారులు టీటీడీకి నివేదించారు.

కొత్త ప్రతిపాదనలు
దీంతో, తాజాగా టీటీడీ అధికారులు ఈ సమస్య పైన ఫోకస్ చేసారు. శిథిలమైన భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా, వరాహస్వామి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళ మాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఇక.. తిరుమలకు వచ్చే వీఐపీ భక్తులకు గదుల కేటాయింపు విషయంలోనూ కొత్త పక్రియ అందుబాటులోకి తీసుకొచ్చారు.తిరుమలలో ఉన్న గదుల్లో 3500 గదులను సామాన్య భక్తులకు కోసం సీఆర్వో పరిధిలో ఉన్న ఈ గదులను ఆధార్ కార్డు ద్వారా కరెంట్ బుకింగ్ కింద కేటాయింపు చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ కింద మరో 1,580 గదులను భక్తులకు కేటాయిస్తున్నారు.


ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

 

విజయశాంతి భర్తను రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా.. సోషల్ మీడియాలో ప్రమోషన్.!

 

మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. వైసీపీ సీనియర్ నేతపై కేసు నమోదు! కారుపై దాడి..

 

పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!

 

నేడు (12/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులునేతలు ఘన నివాళులు!

 

వైసీపీకి నిడదవోలులో చుక్కెదురు! అవిశ్వాస నాటకం నిరాకరించిన కలెక్టర్.. మిగిలింది 14 ఓట్లు మాత్రమే!

 

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TTDUpdates #TirumalaNews #DevoteeConvenience #RoomAllotment #TTDDecisions